తిమ్మాపురంలో లోకకల్యాణార్థం మహాగణపతి హోమం

ABN , First Publish Date - 2022-01-23T05:38:17+05:30 IST

మండలంలోని తిమ్మాపురం గ్రామశివారులోని అఖండ జ్యోతిస్వరూప శ్రీసూర్యనారాయణస్వామి క్షేత్రంలో లోకకల్యాణార్థం సందర్భంగా శనివారం మహాగణపతి హోమం నిర్వహించారు.

తిమ్మాపురంలో లోకకల్యాణార్థం మహాగణపతి హోమం
తిమ్మాపురం సూర్యనారాయణక్షేత్రంలో మహాగణపతి హోమం నిర్వవహిస్తున్న పూజారులు

అర్వపల్లి, జనవరి 22 : మండలంలోని తిమ్మాపురం గ్రామశివారులోని అఖండ జ్యోతిస్వరూప శ్రీసూర్యనారాయణస్వామి క్షేత్రంలో లోకకల్యాణార్థం సందర్భంగా శనివారం మహాగణపతి హోమం నిర్వహించారు. సూర్యభగవానుడి వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో క్షేత్రం వ్యవస్థాపకుడు కాకులారపు జనార్థన్‌రెడ్డి, సుధాకర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ర్టీస్‌ ఎండీ మీలా మహదేవ్‌ దంపతులు, శేఖర్‌, కర్నాటి నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

మట్టపల్లిలో వైభవంగా నృసింహుడి కల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యశాశ్వత కల్యాణాన్ని అర్చకులు వైభవంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిత్యపూజలతో పాటు కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో సిరికొండ నవీన్‌ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.Read more