భూ సేకరణను విరమించుకోవాలి

ABN , First Publish Date - 2022-06-23T06:23:47+05:30 IST

పారిశ్రామిక పా ర్కుకోసం చేపట్టిన భూసేకరణను విరమించుకోవాలని ఆలగడప రైతులు డిమాండ్‌ చేశారు.

భూ సేకరణను విరమించుకోవాలి
రహదారిపై ఆందోళనచేస్తున్న ఆలగడప రైతులు

మిర్యాలగూడ అర్బన్‌, జూన్‌ 22: పారిశ్రామిక పా ర్కుకోసం చేపట్టిన భూసేకరణను విరమించుకోవాలని ఆలగడప రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిం చారు. గ్రామరెవెన్యూ పరిధిలోని 450 ఎకరాల భూమిలో పారిశ్రామిపార్కు ఏర్పాటు చేసి ఫుడ్‌ప్రాసెసింగ్‌ కేంద్రా లు నెలకొల్పే ప్రయత్నాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. కోదాడ - జడ్చర్ల ప్రధాన రహదారిపై బాధిత రైతులు బైఠాయించి సుమారు గంటపాటు ఆందోళ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బాధిత రైతులు మాట్లాడుతూ పార్కుపేరిట చిన్న, సన్నకారురైతుల నుం చి భూములు లాక్కోవటం అన్యాయమన్నారు. అనంత రం ఆర్డీవో రోహిత్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. అయితే పారిశ్రామికపార్కు ఏర్పాటు ప్రక్రియ వాయిదా పడిన తర్వాత తిరిగి ఆలగడప రెవెన్యూ గ్రామపరిధిలో భూసేకరణ ఆంశంపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆర్డీవో తెలిపారు.  

Updated Date - 2022-06-23T06:23:47+05:30 IST