చెర్వుగట్టుపై ఘనంగా లక్ష పుషార్చన

ABN , First Publish Date - 2022-09-26T06:24:02+05:30 IST

అమావాస్య తిథిని పురస్కరించుకు ని మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం లక్ష పుష్పార్చన వేడుకను ఘనంగా నిర్వహించారు.

చెర్వుగట్టుపై ఘనంగా లక్ష పుషార్చన
లక్ష పుష్పార్చన నిర్వహిస్తున్న అర్చకులు

 నార్కట్‌పల్లి, సెప్టెంబరు 25: అమావాస్య తిథిని పురస్కరించుకు ని మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం లక్ష పుష్పార్చన వేడుకను ఘనంగా నిర్వహించారు.  ప్రధానాలయం నుంచి ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య మహా మండపానికి తీసుకువచ్చి పుష్పార్చన వేడుకను భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. స్వామి సన్నిధిలో పూజలందుకున్న పుష్పాలను మహిమాన్వితాలుగా భావించి వాటిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా శివసత్తులు బతుకమ్మలను పేర్చి ఆట పాటలతో భక్తులను అలరించారు. ఈ వేడుకలో దేవస్థాన ఈవో సిరికొండ నవీన కుమార్‌, అభివృద్ధి కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు : రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జనార్ధనరెడ్డి చెర్వుగట్టు దేవస్థానాన్ని సందర్శించారు. ప్రధానాలయంలో మూలవిరాట్‌ వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు జ నార్ధనరెడ్డిని స్వామివారి శేషవస్ర్తాలతో అలంకరించి వేదాశ్వీచరనం చే శారు. అనంతరం మహామండపంలో జరిగిన లక్ష పుష్పార్చన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 


Read more