మార్కెట్‌ చైర్‌పర్సన్‌గా కొమ్మినేని స్రవంతి

ABN , First Publish Date - 2022-10-08T05:39:28+05:30 IST

తిరుమలగిరి వ్యవ సాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్‌ సతీమణి స్రవంతి ఎంపికయ్యారు.

మార్కెట్‌ చైర్‌పర్సన్‌గా  కొమ్మినేని స్రవంతి
స్రవంతి

తిరుమలగిరి, అక్టోబరు 7: తిరుమలగిరి వ్యవ సాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్‌ సతీమణి స్రవంతి ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ చైర్మన్ల పదవికి రిజర్వేషన్లు అమలు చేయడంతో  గతంలో జనరల్‌కు రిజర్వు అయింది.  రొటే షన్‌లో భాగంగా ఈ దఫా బీసీ మహిళకు అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ సూచనలతో రైతుల సంక్షే మానికి పాటుపడతానని అన్నారు. ఈసందర్భంగా స్రవంతిని ఆమె  నివా సంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పోతరాజు రజనిరాజశేఖర్‌, ఎంపీపీ నెమురు గొమ్ముల స్నేహలత కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Read more