దేశ సంస్కృతీ, సంప్రదాయాలు తెలుసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-25T06:07:24+05:30 IST

దేశంలోని సంస్కృతీ, సంప్రదాయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని ఐఆర్‌ఎస్‌ బృందం ప్రతినిధులు సందీప్‌ బాగా, సత్యప్రకాశ్‌, వివేక్‌రెడ్డి, అనిరుధ్‌ అన్నారు. హర్యా నా రాష్ట్రం ఫరీదాబాద్‌లో ఐఆర్‌ఎ్‌సలో శిక్షణ తీసుకుంటున్న 18 రాష్ర్టాలకు చెందిన 30 మంది సందీప్‌ బాగా ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలో శనివారం పర్యటించింది.

దేశ సంస్కృతీ, సంప్రదాయాలు తెలుసుకోవాలి
బతుకమ్మ వేడుకల్లో భాగంగా కోలాటం ఆడుతున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి,

బతుకమ్మ సంబురాలు ఆకట్టుకున్నాయి

ఐఆర్‌ఎ్‌స బృందం సభ్యులు

హుజూర్‌నగర్‌లో పర్యటన

బతుకమ్మ వేడుకల్లో ఆడిపాడిన ట్రైనీ అధికారులు


హుజూర్‌నగర్‌, సెప్టెంబరు 24: దేశంలోని సంస్కృతీ, సంప్రదాయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని ఐఆర్‌ఎస్‌ బృందం ప్రతినిధులు సందీప్‌ బాగా, సత్యప్రకాశ్‌, వివేక్‌రెడ్డి, అనిరుధ్‌ అన్నారు. హర్యా నా రాష్ట్రం ఫరీదాబాద్‌లో ఐఆర్‌ఎ్‌సలో శిక్షణ తీసుకుంటున్న 18 రాష్ర్టాలకు చెందిన 30 మంది సందీప్‌ బాగా ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలో శనివారం పర్యటించింది. స్థానిక ముత్యాల మ్మ దేవాలయం, ఫణిగిరిగట్టు, మట్టపల్లి పుణ్యక్షేత్రంతో పాటు సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలోని వ్యవసాయ పొలాలను, క్షేత్రాలను, మామిడి తోటలను పరిశీలించింది. అనంతరం హుజూర్‌నగర్‌ పట్టణంలోని బృం దావన కాలనీలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ఐఆర్‌ఎస్‌ల బృం దం పాల్గొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం విభిన్న సం స్కృతులకు నిలయమని, ఆయా సంస్కృతీ, సంప్రదాయాల విశిష్టతను పర్యటనలో తెలుసుకుంటున్నామన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని తెలుగు ప్రజల జీవనాడి అయిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలో వ్యవసాయ రంగ స్థితిగతులను, రైతుల స్థితిగతులు తెలుసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్న విషయాన్ని గమనించామన్నారు. బతుకమ్మ పండుగ ఎంతో సాంస్కృతిక నేపథ్యం ఉందన్నారు. బతుకమ్మ వద్ద మహిళల ఆటపాటలు తమను ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయంపై రైతులకున్న మక్కువను అర్థం చేసుకున్నామని తెలిపారు. శిక్షణ అనంతరం తాము చేపట్టబోయే విధుల్లో ఈ పర్యటన తమకెంతో ఉపయుక్తం అవుతుందన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐఎ్‌ఫఎ్‌సలలో చేరి సమాజ శ్రేయస్సుకు యువత పాటుపడుతుందన్నారు. దేశ భవిష్యత్‌ యువత చేతుల్లోనే ఉందన్నారు. యువతీ,యువకులు ఉన్నత ఉద్యోగాలతో పాటు సివిల్‌ సర్వీ్‌సకు పోటీపడాలని సూచించారు. దేశ పౌరులుగా ఈ దేశానికి సేవ చేయడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఈ నెల 26న జరిగే శిక్షణకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఆర్‌ఎ్‌సలు పి.కోటేశ్వరరావు, ప్రభావతి, అదనపు ఎస్పీ సుంకి సురేందర్‌రెడ్డి, బెల్లంకొండ రామచందర్‌గౌడ్‌, చిరంజీవి, అమర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


స్వాగతం పలికిన ఎమ్మెల్యే సైదిరెడ్డి 

హుజూర్‌నగర్‌ పట్టణంలోని బృందావనం కాలనీలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో 30మంది ఐఆర్‌ఎ్‌సల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి ఐఆర్‌ఎ్‌సల బృందానికి ఆహ్వానం పలికి, పుష్పగుచ్ఛాలు అందించి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాల్లో ఐఆర్‌ఎ్‌సల బృందం పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  కార్యక్రమంలో స్థానిక కళాకారులు, మహిళల బృందం పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-25T06:07:24+05:30 IST