కేసీఆర్‌ పాలనను అంతమొందించాలి

ABN , First Publish Date - 2022-12-03T00:15:39+05:30 IST

రాష్ట్రంలో అవినీతి సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతమొందించి ప్రజలకు విముక్తి కల్పిస్తామని కేంద్ర బొగ్గు గను లు, పార్లమెంట్‌ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి అన్నారు.

కేసీఆర్‌ పాలనను అంతమొందించాలి
తిరుమలగిరిలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి, చౌటుప్పల్‌లో మాట్లాడుతున్న చంద్రశేఖర్‌

నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రజల మద్దతు కావాలి

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి

కట్టంగూరు, తిరుమలగిరి, నార్కట్‌పల్లి, శాలిగౌరారం, డిసెంబరు 2: రాష్ట్రంలో అవినీతి సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతమొందించి ప్రజలకు విముక్తి కల్పిస్తామని కేంద్ర బొగ్గు గను లు, పార్లమెంట్‌ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి అన్నారు. శుక్రవారం కట్టంగూరు మండలంలోని అయిటిపాముల గ్రామంలో నిర్వహించిన రైతులతో ముఖాముఖి, నార్కట్‌పల్లి, తిరుమలగిరి లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి శక్తి కేంద్రాల ఇన్‌చార్జీల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు దేశానికే వెన్నెముకని, ప్రధానమైన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే నరేంద్రమోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇళ్లు, ఫసల్‌బీమా పథకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుండగా, వాటి పేర్లను మార్చి రాష్ట్ర ప్ర భుత్వం కోట్ల రూపాయలను ఇతర పథకాలను మ ళ్లిస్తోందని ఆరోపించారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమాల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు.

యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి

చౌటుప్పల్‌ టౌన్‌: యువత వ్యసనాలకు దూరంగా ఉండి, దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆర్‌ఎ్‌సఎస్‌ దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్‌ ఎక్క చంద్రశేఖర్‌ కోరారు. చౌటుప్పల్‌ పట్టణంలో శుక్రవారం నైజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాల్లో భాగంగా డివిజన్‌స్థాయి యువ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ దేశ భవిష్యత్‌ యువత చేతుల్లో ఉందని, యువత సక్రమమైన మార్గంలో నడుచుకోవాలన్నారు. పాశ్చాత్య సంస్కృతిని వీడి, స్వదేశీ సంస్కృతితో ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలన్నారు. దేశంకోసం అవసరమైతే ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ సహ ప్రముఖ్‌ నర్రా శివకుమార్‌, మండల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గుజ్జుల సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-03T00:15:41+05:30 IST