కేసీఆర్‌ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష

ABN , First Publish Date - 2022-10-17T06:04:16+05:30 IST

సీఎం కేసీఆర్‌ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

కేసీఆర్‌ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు

కోదాడ, అక్టోబరు 16: సీఎం కేసీఆర్‌ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా  ఆదివారం యాదాద్రి భువన గిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట, కాగితాపురం గ్రామాల్లో ప్రచారం చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమా వేశంలో వివిధ పార్టీలకు చెందిన 50కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మును గోడు ఉప ఎన్నికలో  కారు గుర్తుకు ఓటు  వేసి కూసుకుంట్ల ప్రభాకర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏ ప్రాంతంలో చూసినా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కనిపి స్తున్నాయన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన స్వార్ధం కోసం ఉప ఎన్నికను తీసుకువచ్చారన్నారు.  కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, సర్పంచ్‌ జంగయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు యాదగిరి, మండల నాయకులు, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. 

 ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలి: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి 

హుజూర్‌నగర్‌: మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి కోరారు. చౌటుప్పల్‌ మండలం లోని పంతంగి గ్రామంలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన వారు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ చేపడు తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, అరిబండి సురేష్‌, అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2022-10-17T06:04:16+05:30 IST