జాతీయ సమగ్రతకు మార్గదర్శనం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-09-17T06:43:40+05:30 IST

జాతీయ సమగ్రతకు మార్గదర్శనం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అ ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

జాతీయ సమగ్రతకు మార్గదర్శనం కేసీఆర్‌
దేవరకొండలో నిర్వహించిన వజ్రోత్సవంలో మాట్లాడుతున్న రవీంద్రకుమార్‌

జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో  ప్రజాప్రతినిధులు 

దేవరకొండ, హాలియా, చండూరు, నకిరేకల్‌, మిర్యాలగూడ, సె ప్టెంబరు 16: జాతీయ సమగ్రతకు మార్గదర్శనం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అ ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. జిల్లాలోని పలు పట్టణాల్లో శుక్రవారం తెలంగాణ జాతీయ స మైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భారత దేశానికి ఆదర్శం కావాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమన్నారు. కులాలు, మతాల పేరుతో విచ్ఛిన్నానికి బీజే పీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. సెప్టెంబరు 17న నిర్వహించేది ముమ్మాటికి జాతీయ సమైక్యత దినోత్సవమేనని పేర్కొన్నారు. 

  దేవరకొండలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గం నుంచి ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్చందసంస్థలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలకు అభినందనలు తెలిపారు. వజ్రోత్సవాలలో వివిధ పాఠశాలల విద్యార్థుల నృత్యాలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆర్డీవో గో పిరాం అధ్యక్షతన జరిగిన సభలో డీఎస్పీ నాగేశ్వర్‌రావు, మునిసిపల్‌ చైర్మన ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ జానయాదవ్‌, సునీతజనార్ధనరావు, వంగాల ప్రతా్‌పరెడ్డి, చందు, ప్రవీణవెంకట్‌రెడ్డి, అరుణసురే్‌షగౌడ్‌ పాల్గొన్నారు. 

 హాలియాలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే భగత, అదనపు కలెక్టర్‌  భాస్కర్‌రావు పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మలు, కోలాటాలు, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన వారు మాట్లాడుతూ స్వా తంత్య్ర సమరయోధుల స్ఫూర్తితోనే తెలంగాణలో సీఏం కేసీఆర్‌ పరిపాలన సాగుతుందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే భగత పాట పాడి అలరించా రు. కార్యక్రమంలో ట్రైకార్‌ చైర్మన ఇస్లావత రాంచందర్‌నాయక్‌, జడ్పీవైస్‌ చై ర్మన ఇరిగి పెద్దులు, నాగేశ్వర్‌రావు, స్పెషల్‌ ఆఫీసర్‌ రాజ్‌కుమార్‌, మునిసి పల్‌ చైర్‌పర్సన వెంపటి పార్వతమ్మశంకరయ్య, మిల్లర్స్‌ అసోసియేషన అధ్యక్షులు చిట్టిపోలుయాదగిరి, సీఐలు సురే్‌షకుమార్‌, నాగరాజు, కమిషనర్‌   వీ రారెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. 

చండూరు మండల కేంద్రంలోని జడ్పీహెచఎ్‌సలో ఏర్పాటు చేసిన స భకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింయ్యయాదవ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంతోమంది త్యాగాలతో హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నకిరేకల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే లింగయ్య మాట్లాడారు. సమరయోధుల స్ఫూర్తితోనే సీఎం కే సీఆర్‌ ప్రగతిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రో గ్రామ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ పుష్పలత, నకిరేకల్‌, చిట్యాల మునిసిపల్‌ చైర్మన్లు రాచకొండ శ్రీనువా్‌సగౌడ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మి, తరాల బలరాం, నకిరేకల్‌ మార్కెట్‌ చైర్మన కొప్పుల ప్రదీ్‌పరెడ్డి, కమిషనర్‌ బాలాజీ, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. వజ్రోత్సవాల్లో ఎమ్మెల్యే లింగ య్య మహిళలతో కలిసి ఆడిపాడి సభికులను ఆనందపరిచారు. 

మిర్యాలగూడ పటట్ణంలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మునిసిపల్‌ చైర్మన భార్గవ్‌ జాతీయజెండా ను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గుత్తా మాట్లాడుతూ నూతన సచివాలలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టడం చారిత్రాత్మకమన్నారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు రాజ్యాం గ నిర్మాత పేరు పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రోహితసింగ్‌, డీఎస్పీ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు చింతరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, సరళ, నారాయణరెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ స మైక్యతా వజ్రోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎన్నెస్పీ క్యాంపు గ్రౌం డ్‌ లో ఏర్పాటు చేసిన సభావేదికకు కుడివైపున ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీ న్లు విద్యార్థులపై పడ్డాయి. దీంతో పట్టణంలోని కాకతీయ ఉన్నత పాఠశాల కు చెందిన నలుగురు విద్యార్థినులు గాయపడ్డారు. వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.  



Updated Date - 2022-09-17T06:43:40+05:30 IST