కేసీఆర్‌వి తుపాకీ రాముడి మాటలు

ABN , First Publish Date - 2022-04-22T06:29:24+05:30 IST

సీఎం కేసీఆర్‌వి తు పాకీ రాముడి మాటలని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రవీందర్‌నాయక్‌ అన్నారు.

కేసీఆర్‌వి తుపాకీ రాముడి మాటలు
పాఠశాల టీచర్లతో మాట్లాడుతున్న రవీందర్‌నాయక్‌

మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రవీందర్‌నాయక్‌

దామరచర్ల, మిర్యాలగూడ, ఏప్రిల్‌ 21: సీఎం కేసీఆర్‌వి తు పాకీ రాముడి మాటలని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రవీందర్‌నాయక్‌ అన్నారు. దామరచర్ల మండలకేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల అస్వస్థతకు గురైన విద్యార్థినులను గురువారం ఆయన పరామర్శించారు. విద్య, వైద్య రం గాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. రైతులకు మద్దతు ధర, నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన, సమస్యల పరిష్కారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రం లో జరుగుతున్న గిరిజన రిజర్వేషన పెంపు ఉద్యమానికి నాయకత్వం వ హించనున్నట్లు తెలిపారు. దళితబంధు పథకంతో దళితులను ఊరిస్తుండగా, గి రిజనులకు అన్యాయం చేస్తుందని ఆ యన విమర్శించారు. ఎనిమిదేళ్ల కాలం లో రూ.2.5లక్షల కోట్ల నిధులను దుర్వినియోగం చేసి లండన, దుబాయ్‌లో ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. 


Updated Date - 2022-04-22T06:29:24+05:30 IST