కన్నుల పండువగా కంఠ మహేశ్వరస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2022-10-17T06:36:56+05:30 IST

కంఠమహేశ్వరస్వామి కల్యాణాన్ని క న్నుల పండువగా నిర్వహించారు.

కన్నుల పండువగా కంఠ మహేశ్వరస్వామి కల్యాణం
నకిరేకల్‌లో బోనాలు సమర్పిస్తున్న మహిళలు

నకిరేకల్‌, అక్టోబరు 16: కంఠమహేశ్వరస్వామి కల్యాణాన్ని క న్నుల పండువగా నిర్వహించారు. ఆదివారం నకిరేకల్‌లోని తాటికల్‌ రో డ్డులో ఉన్న కంఠమహేశ్వరస్వామి సురమాంబదేవి, శ్రీ వనంఎల్లమ్మ తల్లి, వనం మైసమ్మతల్లి దేవతల ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో వెళ్లి నైవేద్యం సమర్పించారు. ఉదయం నుంచే స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌడ కులస్థులు మోకు ము స్తాదులకు పూజలు నిర్వహించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవా న్ని  తిలకించేందుకు నకిరేకల్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధి క సంఖ్యలో రావడంతో పట్టణంలో సందడి నెలకొంది. నకిరేకల్‌ ఎ మ్మెల్యే చిరుమర్తి లిం గయ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీపీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య, టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌, ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన రాష్ట్ర మాజీ చైర్మన పూజార్ల శంభయ్య, నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన రాచకొండ శ్రీనువా్‌సగౌడ్‌, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన కొండ జానయ్యగౌడ్‌, నాయకు లు కొండ శ్రీను, మురారిశెట్టి కృష్ణమూర్తి, యల్లపురెడ్డి సైదిరెడ్డి, రాచకొండ శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-17T06:36:56+05:30 IST