కమనీయం నరసింహుడి కల్యాణం

ABN , First Publish Date - 2022-10-07T05:51:04+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని వేదపండితులు గురువారం కన్నుల పండువగా నిర్వహించారు.

కమనీయం నరసింహుడి కల్యాణం
స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మఠంపల్లి, అక్టోబరు 6: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని వేదపండితులు గురువారం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయంలో విశ్వక్ష్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన అనంతరం స్వామివారికి మాంగ్యధారణ తలంబ్రాలతో అర్చకులు నిత్య కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌ పాల్గొన్నారు. 

Read more