పేదింటి ఆడబిడ్డలకు ‘కల్యాణలక్షి’ వరం

ABN , First Publish Date - 2022-03-05T06:28:18+05:30 IST

పేదింటి ఆడబిడ్డలు వివాహ సమయం లో ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ క ల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎ మ్మెల్యే నోముల భగత అన్నారు.

పేదింటి ఆడబిడ్డలకు ‘కల్యాణలక్షి’ వరం
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే భగత

పెద్దవూర, మార్చి 4: పేదింటి ఆడబిడ్డలు వివాహ సమయం లో ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ క ల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎ మ్మెల్యే నోముల భగత అన్నారు. మండల కేంద్రంలోని మల్లిఖార్జున ఫంక్షనహాలులో నిర్వహించిన వివిధ గ్రామాలకు చెందిన 53 మం ది లబ్ధిదారులకు వారు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఆపత్కాల సమయంలో సైతం రాష్ట్రంలోని పేదలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ కు దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన గుం టక వెంకట్‌రెడ్డి, ఆర్‌ఎ్‌సఎస్‌ మండలాధ్యక్షుడు గజ్జల లింగారెడ్డి, త హసీల్దార్‌ సైదులు, మండల అధ్యక్షుడు రవికుమార్‌, రైతుసంఘం అధ్యక్షుడు సుంకిరెడ్డి, ఎస్టీసెల్‌ అధ్యక్షుడు రమావత రవినాయక్‌, నాయకులు కిషననాయక్‌, రాజే్‌షనాయక్‌ పాల్గొన్నారు.

 

Read more