కాళోజీ జీవితం ఆదర్శం

ABN , First Publish Date - 2022-09-10T06:26:51+05:30 IST

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు.

కాళోజీ జీవితం ఆదర్శం
కాళోజీ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

జడ్పీచైర్మన్‌ సందీ్‌పరెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు9: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని జడ్పీకార్యాలయం, కలెక్టరేట్‌, ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ యాసకు ప్రపంచస్థాయి గుర్తింపు తేవడంలో కాళోజీ చేసిన విశేష కృషి గొప్పదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీ సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, తహసీల్దార్‌ కె.వెంకట్‌రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మల, ఎంపీడీవో గుత్తా నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 


చదువుతో పాటు క్రీడలపై శ్రద్ధ చూపాలి 

చదువుతోపాటు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపి అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరచాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పలువురు క్రీడాకారులను ఆమె సన్మానించారు. ఖేలో ఇండియా ఉమెన్స్‌ జూడో నేషనల్‌ లీగ్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌, సౌత్‌జోన్‌ పోటీలు కేరళలో ఈ నెల 1వ తేదీ నుంచి 5వరకు నిర్వహించారు. ఆ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన బీబీనగర్‌ మండలం వెంకిర్యాల క్రీడాకారిణులు శ్రీనిజ, సుష్మ, వెన్నల, శ్రావణి, వైష్ణవి, తేజస్వినిలను అభినం దించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, జిల్లాయువజన క్రీడలశాఖ అధికారి కె.ధనుంజయ్‌, కరస్పాండెంట్‌ బి.ప్రవీణ్‌కుమార్‌, మురళీ, కోచ్‌ పర్వేజ్‌,  పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-10T06:26:51+05:30 IST