కారోబార్‌ కుటుంబానికి న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2022-10-04T05:37:57+05:30 IST

మండలంలోని చందుపట్ల గ్రామంలో గ్రామపంచా యతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన కారోబార్‌ యాటకారి మల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని పంచాయతీ సిబ్బంది డిమాండ్‌ చేశారు.

కారోబార్‌ కుటుంబానికి న్యాయం చేయాలి
మద్దిరాలలో రాస్తారోకో చేస్తున్న స్థానికులు, గ్రామపంచాయతీ సిబ్బంది

మద్దిరాల, అక్టోబరు 3 : మండలంలోని చందుపట్ల గ్రామంలో గ్రామపంచా యతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన కారోబార్‌ యాటకారి మల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని పంచాయతీ సిబ్బంది డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం మండలకేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి ఆర్థికసాయంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. మల్లయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నాయకులు గౌడిచర్ల సత్యనారాయణగౌడ్‌, కుశలవచారి, తొనుకునూరి వెంకన్న,  లింగాల రాములు, శంభయ్య, పాల్గొన్నారు. 


Read more