రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి

ABN , First Publish Date - 2022-11-12T00:13:49+05:30 IST

నాంపల్లి మండలం మహమ్మదపురం గ్రామశివారులో లారీ, బైక్‌ ఢీకొన్న ఘటనలో మండలానికి చెందిన జర్నలిస్టు ఎలిజాల కృష్ణయ్య(35) మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి
కృష్ణయ్య (ఫైల్‌ )

దేవరకొండ, నవంబరు 11 : నాంపల్లి మండలం మహమ్మదపురం గ్రామశివారులో లారీ, బైక్‌ ఢీకొన్న ఘటనలో మండలానికి చెందిన జర్నలిస్టు ఎలిజాల కృష్ణయ్య(35) మృతి చెందారు. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణయ్య నాంపల్లి మండల కేంద్రంలో ఒక పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. శుక్రవారం బైక్‌పై గుర్రంపోడు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కృష్ణయ్య భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కృష్ణయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని వివిధపత్రికల విలేకరులు ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2022-11-12T00:13:49+05:30 IST

Read more