బీజేపీలో పలువురి చేరిక

ABN , First Publish Date - 2022-09-11T06:16:33+05:30 IST

మండలంలోని మల్లపురాజుపల్లి గ్రా మంలోని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి 20మంది కార్యకర్తలు, మం డల నాయకులు ఏరెడ్ల రఘుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య ఆధ్వర్యంలో శనివారం బీజేపీలో చేరారు.

బీజేపీలో పలువురి చేరిక
బీజేపీలో చేరుతున్న కార్యకర్తలు

నాంపల్లి, సెప్టెంబరు 10: మండలంలోని మల్లపురాజుపల్లి గ్రా మంలోని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి 20మంది కార్యకర్తలు, మం డల నాయకులు ఏరెడ్ల రఘుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య ఆధ్వర్యంలో శనివారం బీజేపీలో చేరారు. టీఆర్‌ఎస్‌ వార్డు సభ్యుడు మట్టిపల్లి యాద య్య, గజ్జల పద్మ, గోవర్ధనరెడ్డి, పంగ చిన్న ముత్యాలు కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ సర్పంచ లక్ష్మీకరుణకర్‌, వంగాల సత్యనారాయణరెడ్డి, వం గాల మోహనరెడ్డి, గొడ్డటి ముత్యాలు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మునుగోడును అభివృద్ధి చేసేందుకే బీజేపీలో చేరారని, బీజేపీతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మంచికంటి శ్రీశైలం, బీజేవైఎం అధ్యక్షుడు నాంపల్లి సతీష్‌, జిల్లా నాయకులు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more