రేషన్‌ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2022-07-05T05:57:44+05:30 IST

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కమీషన్‌ను పెంచాలని రేషన్‌ డీలర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా, రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంఘాల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట డీలర్లు సోమవారం ఆందోళన నిర్వహించారు.

రేషన్‌ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
పాలకవీడు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న రేషన్‌ డీలర్లు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కమీషన్‌ను పెంచాలని రేషన్‌ డీలర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా, రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంఘాల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట డీలర్లు సోమవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆయా మండల తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. మహా రాష్ట్రలో డీలర్లకు క్వింటాకు రూ.400 కమీషన్‌ ప్రభుత్వం అందించి, ఉద్యోగ భద్రత కల్పిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో డీలర్లను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 11న జిల్లా కేంద్రంలో, 18న హైదరాబాద్‌లో, ఆగస్టు 2న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఆందోళనలో పాల్గొననున్నట్లు వారు తెలిపారు. మద్దిరాలలో జరిగిన ధర్నాలో డీలర్ల సంఘం జిల్లా నాయకుడు గూడ వెంకట్‌రెడ్డి, మల్లేష్‌, లింగాచారి, వెంకన్న, రాజేశ్వర్‌రావు, దుర్వాసరావు, సత్తయ్య, పద్మయ్య పాల్గొన్నారు. మోతెలో ధర్నాలో సంఘం నాయకుడు కొండా పిచ్చయ్య, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, గాంధీ, రామ్‌రెడ్డి, గురువయ్య, సీతారాములు, నరేష్‌ పాల్గొన్నారు. పెన్‌పహాడ్‌లో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బెల్లంకొండ లక్ష్మీ, బుస్స పాపయ్య, వెంకటయ్య, రజీయాభేగం, అనురాధ, సౌజన్య, సుగుణ, అలివేలు, కిరణ్‌ పాల్గొన్నారు. హుజూర్‌ నగర్‌లో సంఘం మండల అధ్యక్షుడు ఇట్టిమళ్ళ మధుసువార్తతో పాటు రాగం లింగయ్య, దాసరి ధనమూర్తి, మట్టయ్య, నాగేశ్వరరావు, వరలక్ష్మీనవ్య, సత్యవతి, నాగమణి, సావిత్రి పాల్గొన్నారు. అర్వపల్లిలో  డీలర్లు దండ భద్రారెడ్డి, మామిడి శ్రీనివాస్‌, కుంభం మల్లయ్య, నిర్మల, వెంకటేశ్వర్లు, శ్రీలత, జనార్థన్‌, శ్రీనివాస్‌, చంద్రకళ, భరత్‌కుమార్‌, అంజమ్మ, రవీందర్‌, సుభద్ర, అశోక్‌, ఉమాదేవి పాల్గొన్నారు. పాలకవీడులో డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు గుండా నర్సింహారావు, రాములు, సురేష్‌,  నగేష్‌, సైదిరెడ్డి పాల్గొన్నారు.  తుంగతుర్తిలో రేషన్‌ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు ఓర్సు వెంకన్న, కె.యాదగిరి, వి.శ్రీను, బి.వెంకటనర్సయ్య పాల్గొన్నారు. అనంతగిరిలో జరిగిన ధర్నాలో సంఘం మండల అధ్యక్షుడు సంఘబోయిన అంతయ్య, డీలర్లు పాల్గొన్నారు. గరిడేపల్లిలో మండల రేషన్‌ డీలర్లు పాల్గొన్నారు.Read more