జగ్జీవనరామ్‌ జీవితం స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-07-07T06:06:55+05:30 IST

మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవనరామ్‌ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు నేతలు కొనియాడారు.

జగ్జీవనరామ్‌ జీవితం స్ఫూర్తిదాయకం


భువనగిరి టౌన, జూలై 6: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవనరామ్‌  జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు నేతలు కొనియాడారు. జగ్జీవనరామ్‌ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం భువనగిరిలో ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభివృద్ధికి, దేశ ప్రగతిలో ఆయన పాత్రను కొనియాడారు. వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో మునిసిపల్‌ చైర్మన ఎనబోయిన అంజనేయులు, వైస్‌చైర్మన చింతల కిష్టయ్య, గిడ్డంగుల కార్పోరేషన మాజీ చైర్మన మందుల సామెల్‌ టీపీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఏవి కిరణ్‌, బాబూ జగ్జీవనరామ్‌ ఆశయ సాధన సంఘం జిల్లా అధ్యక్షుడు బర్రె సుదర్శన, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్‌, ఇట్టబోయిన గోపాల్‌, కంచెనపల్లి నర్సింగ్‌రావు, గడ్డపార జంగయ్య, మాజీ జడ్పీటీసీ సందెల సుధాకర్‌, ఎండి అంజద్‌ పాల్గొన్నారు. 

మోత్కూరు :  జగ్జీవనరామ్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌ కోరారు. జగ్జీవనరామ్‌ 36వ వర్ధంతి సందర్భంగా మోత్కూరులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  కార్యక్రమం లో బీఆర్‌ఎ్‌సఎస్‌ పట్టణ అధ్యక్షుడు నిలిగొండ మత్స్యగిరి, నాయకులు వడకాల సుదర్శన పాల్గొన్నారు.

బీబీనగర్‌: బీబీనగర్‌ మండల కేంద్రంతో పాటు కొండమడుగు గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో జగ్జీవనరామ్‌ వర్ధంతిని నిర్వహించారు.  కార్యక్రమాల్లో సర్పంచ కడెం లతా రాజే్‌షబాబు, ఉపసర్పంచ రంగ కృష్ణవేణి, నాయకులు సుదర్శనరెడ్డి, రాజమల్లేష్‌, పొట్ట నవీన ల్గొన్నారు.  

Read more