మాదిగలను మోసం చేస్తోన్న కేంద్రం ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-08-04T05:31:49+05:30 IST
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి యాతాకుల రాజయ్యమాదిగ అన్నారు.
సూర్యాపేట(కలెక్టరేట్), ఆగష్టు 3: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి యాతాకుల రాజయ్యమాదిగ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు వి.కృష్ణ, బోస్కా సురేష్, వెంకటనర్సయ్య, చింతలపాటి చినశ్రీరాములు, కునుకుంట్ల వెంకన్న, శ్రీనివాస్, మల్లేష్, సంతోష్, సతీష్ పాల్గొన్నారు.