ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం హర్షనీయం

ABN , First Publish Date - 2022-05-19T06:36:52+05:30 IST

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం హర్షనీయమని బీసీ సంక్షేమ సంఘం, ఉద్యోగ, యువజన సంఘాల నాయకులు అన్నారు.

ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం హర్షనీయం
సంబరాలు చేసుకుంటున్న బీసీ సంఘం నాయకులు

నల్లగొండ టౌన్‌, మే 18: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం హర్షనీయమని బీసీ సంక్షేమ సంఘం, ఉద్యోగ, యువజన సంఘాల నాయకులు అన్నారు. జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో మంగళవారం రాత్రి బీసీ సంక్షేమ సంఘం, ఉద్యోగ, యువజన సంఘాల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ సమస్యలు పరిష్కరించా లని నాలుగున్నర దశాబ్ధాలుగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక పోరాటాలు చేసిన ఆర్‌. కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలందరూ ఆయనకు రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరు నారాయణయాదవ్‌, యువజన సంఘం అధ్యక్షుడు మునాస ప్రసన్నకుమార్‌, సంక్షేమ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మిర్యాల వెంకటేశం, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్‌, మామిడి పద్మ, బక్కతట్ల వెంకన్నయాదవ్‌, వడ్డెపల్లి సైదులు, రాపర్తి భాస్కరాచారి, ఎన్‌. శ్రీనివాస్‌, ఎల్‌. వెంకన్న, భిక్షం, బరిగల సుదర్శన్‌, నల్లమోతు శ్రీనివాస్‌యాదవ్‌, వట్టె రాములు, సత్యం, పరమేశ్‌, పగిళ్ల కృష్ణ, సతీష్‌, అరవింద్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T06:36:52+05:30 IST