కార్యాలయాల ఏర్పాటుకు భవనాల పరిశీలన

ABN , First Publish Date - 2022-09-29T06:31:14+05:30 IST

నూతనంగా రెవెన్యూ మండలంగా ఏర్పాటైన గట్టుప్పల లో పరిపాలన సౌలభ్యం కోసం, మండల ప్రారంభం కోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యా రు.

కార్యాలయాల ఏర్పాటుకు భవనాల పరిశీలన

చండూరు రూరల్‌, సెప్టెంబరు 28: నూతనంగా రెవెన్యూ మండలంగా ఏర్పాటైన గట్టుప్పల లో పరిపాలన సౌలభ్యం కోసం, మండల ప్రారంభం కోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యా రు. నూతన కార్యాలయాలను ఏ ర్పాటు చేయడానికి  బుధవారం గట్టుప్పల మండల కేంద్రానికి నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్డీవో జగన్నాధరావులు సర్పంచ ఇడెం రోజాతో కలిసి ప లు భవనాలను పరిశీలించారు. పోలీస్టేషన ఏర్పాటుకు లచ్చమ్మగూడెం రోడ్డులో గ తంలో ప్రతిపాదించి అన్ని ఏర్పాట్లు చేసిన భవనాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. త హసీల్దార్‌ కార్యాలయానికి ఆర్డీవో జగన్నా థరావు మండల కేంద్రంలో రెండు భవనాలను పరిశీలించి తేరట్‌పల్లి రోడ్డులో గల ప్రైవేటు అద్దె భవనాన్ని దాదాపు ఖరారు చే స్తున్నట్లు తెలిసింది. వారి వెంట సీఐ అశోక్‌రెడ్డి, తహసీల్దార్‌ గణేష్‌, పంచాయతీ కా ర్యదర్శి షఫీ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. 


Read more