పింఛన్ల ఎంపికలో అర్హులకు అన్యాయం

ABN , First Publish Date - 2022-08-25T06:52:57+05:30 IST

మూడేళ్ల అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్లలో అర్హులకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, మాజీ చైర్మన బర్రె జహాంగీర్‌, కౌన్సిలర్‌ ఈరపాక నర్సింహ అన్నారు.

పింఛన్ల ఎంపికలో అర్హులకు అన్యాయం

భువనగిరి టౌన, ఆగస్టు 24: మూడేళ్ల అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్లలో అర్హులకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ మునిసిపల్‌  ఫ్లోర్‌ లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, మాజీ చైర్మన బర్రె జహాంగీర్‌, కౌన్సిలర్‌ ఈరపాక నర్సింహ అన్నారు. బుధవారం భువనగిరిలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ధనవంతులకు పింఛన్లు దక్కగా, నిరుపేద రిక్షాకార్మికులు, నిత్య కూలీలకు మాత్రం నిరాశే మిగిలిందన్నారు. అర్హుల గుర్తింపు సర్వేలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించకపోవడం, అధికార పార్టీ నాయకుల మితిమీరిన జోక్యంతో ఆసరా పింఛన లబ్ధిదారుల ఎంపిక అస్తవ్యస్తంగా ఉన్నదన్నారు. ఇప్పటికైనా మరోమారు సర్వే చేసి అర్హులకు పింఛన్లు అందజేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళనను చేపడుతామన్నారు. సమావేశంలో నాయకులు వడిశర్ల కృష్ణ పాల్గొన్నారు. 

Read more