పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
ABN , First Publish Date - 2022-12-15T00:03:10+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులైన తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్య పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారునలు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదేశించారు. మండలంలోని విజయరాఘవపురం, బరాకత్‌గూడెం, మునగాల పాఠశాలల్లో మన ఊరు, మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను బుధవారం పరిశీలించారు.
మునగాల రూరల్, డిసెంబరు 14: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులైన తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్య పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారునలు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదేశించారు. మండలంలోని విజయరాఘవపురం, బరాకత్‌గూడెం, మునగాల పాఠశాలల్లో మన ఊరు, మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ఊరు, మన బడి పథకం కింద మొదటి విడతలో మండలంలోని 14 పాఠశాలలను ఎంపిక చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు లేకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. వెంటనే పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీపీ ఎలక బిందు నరేందర్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, అజయ్‌కుమార్, తదితరులు ఉన్నారు.
కలకోవ జడ్పీ పాఠశాలను తనిఖీచేసిన డీఈవో
మండలంలోని కలకోవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మన ఊరు, మన బడిలో పథకంలో భాగంగా పాఠశాలలో చేపడుతున్న పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదిలో విద్యార్థుల సమర్ధ్యాలను, పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట మండల విద్యాధికారి ఎండి.సలీం, ప్రధానోపాధ్యాయులు పప్పుల వీరబాబు, ఉపాధ్యాయులు వెంకన్న, వెంకటేశ్వర్లు, రజిని, నాగలక్ష్మి, నర్సారావు, సత్యనారాయణ, ఎంఐఎస్ కోఆర్డినేటర్ రాంబాబు ఉన్నారు.