పెంచిన బస్‌ చార్జీలను తగ్గించాలి

ABN , First Publish Date - 2022-06-12T06:25:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీసీ రిజర్వేషన సాధన సమితి నాయకులు డిమాండ్‌చేశారు.

పెంచిన బస్‌ చార్జీలను తగ్గించాలి

బీసీ రిజర్వేషన సాధన సమితి నాయకుల డిమాండ్‌

మోత్కూరు, జూన 11: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీసీ రిజర్వేషన సాధన సమితి నాయకులు డిమాండ్‌చేశారు. ఈమేరకు బీఆర్‌ఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో  శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్‌ పరం చేసే కుట్రలో భాగంగా బస్సు చార్జీలను విపరీతంగా పెంచుతున్నారని విమర్శించారు. చిల్లర సరిచేసే నెపంతో ఓ సారి, డీజిల్‌ సెస్‌ పేరిట రెండు సార్లు బస్సు చార్జీలు పెంచారన్నారు. 2018 తర్వాత బస్సు చార్జీలను ఒకే సారి 50 శాతం పెంచారన్నారు. విద్యార్థుల బస్సుపాస్‌ చార్జీలు పెంచడంతో పేద, మద్యతరగతి కుటుంబాల విద్యార్థులు తమ చదువులను అర్ధాంతరంగా మానుకోవాల్సి దుస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు, బీఆర్‌ఎ్‌సఎస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గుండు శ్రీను, నాయకులు పానుగుళ్ల రవి, అన్నందాసు మత్స్యగిరి, సురిగల రామచంద్రు, బయ్యని జనార్ధన, బోనగిరి సతీష్‌, బుంగ యాదయ్య, పంగ వెంకన్న, రాములు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-12T06:25:45+05:30 IST