భారత్ యూరియా
ABN , First Publish Date - 2022-12-19T00:18:05+05:30 IST
కొంతకాలంగా ఎదురుచూస్తున్న భారత్ యూరియా మార్కెట్లోకి వచ్చేసింది. ఇంతకాలం వివిధ కంపెనీలు తయా రు చేసే యూరియాను ఆయా కంపెనీల పేరుతోనే అమ్ముతుండేవారు. ఏకంపెనీ తయారు చేసే యూరియాలోనైనా ఒకే రకమైన పోషకాలు, 46 శాతం నత్రజని ఉండేది. అయినా కొన్ని కంపెనీల యూరియాకే మార్కెట్లో ఎక్కువగా డిమాండ్‌ఉండేది. రైతులు దుకాణానికి వెళితే ఫలానా యూరి యా కావాలని అడిగితీసుకునేవారు. దాంతో డిమాండ్ ఉన్న కంపెనీలు తమ యూరియా బస్తాలకు రైతులకు పెద్దగా ఉపయోగంలేని ఉత్పత్తుల ను అంటగట్టి విక్రయించేవి. లింక్ పెట్టి ఇచ్చే ఉత్పత్తులతో తమకు పెద్దగా ప్రయోజనం లేకపోయినా రైతులు ఆ కంపెనీ యూరియా కావాలన్న ఉద్దేశ్యంతో వాటిని కొనుగోలుచేసి, ఆర్థికంగా నష్టపోయేవారు.
ఇక దేశమంతటా ఒకే బ్రాండ్ యూరియా
పేరు మార్పుతో పేరున్న కంపెనీలకు కొంత దెబ్బ
త్వరలో కాంప్లెక్స్ బస్తాలు కూడా
మోత్కూరు, డిసెంబరు 18: కొంతకాలంగా ఎదురుచూస్తున్న భారత్ యూరియా మార్కెట్లోకి వచ్చేసింది. ఇంతకాలం వివిధ కంపెనీలు తయా రు చేసే యూరియాను ఆయా కంపెనీల పేరుతోనే అమ్ముతుండేవారు. ఏకంపెనీ తయారు చేసే యూరియాలోనైనా ఒకే రకమైన పోషకాలు, 46 శాతం నత్రజని ఉండేది. అయినా కొన్ని కంపెనీల యూరియాకే మార్కెట్లో ఎక్కువగా డిమాండ్‌ఉండేది. రైతులు దుకాణానికి వెళితే ఫలానా యూరి యా కావాలని అడిగితీసుకునేవారు. దాంతో డిమాండ్ ఉన్న కంపెనీలు తమ యూరియా బస్తాలకు రైతులకు పెద్దగా ఉపయోగంలేని ఉత్పత్తుల ను అంటగట్టి విక్రయించేవి. లింక్ పెట్టి ఇచ్చే ఉత్పత్తులతో తమకు పెద్దగా ప్రయోజనం లేకపోయినా రైతులు ఆ కంపెనీ యూరియా కావాలన్న ఉద్దేశ్యంతో వాటిని కొనుగోలుచేసి, ఆర్థికంగా నష్టపోయేవారు. ఇప్పుడు మార్కెట్లోకి అంతా ‘భారత్ యూరియా’ అన్న ఒకే బ్రాండ్‌తో రావడంవల్ల పేరు న్న కంపెనీల డిమాండ్ తగ్గి అంటగట్టడం తగ్గుతాయని ఎరువుల దుకాణాల డీలర్లు, రైతులు అభిప్రాయపడుతున్నారు. బస్తాలపై ‘భారత్ యూ రియా’ అనే పేరును ప్రధానంగా ముద్రించి ఉత్పత్తి చేసిన కంపెనీ పేరు ను కింద ముద్రిస్తారు. దీంతో కొందరు రైతులు ఫలానా కంపెనీ యూరియానేకావాలని అడిగి కొనే అవకాశమున్నప్పటికీ గతంలో ఉన్నంత డిమా ండ్ ఉండదంటున్నారు. కొంతకాలం తర్వాత బస్తాలపై ఉత్పత్తిదారుపేరు కూడా తొలగించే ప్రతిపాదన ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఎరువులు డీలర్ల సంఘం నాయకుడొకరు చెప్పా రు. త్వరలేనే కాంప్లెక్స్ బస్తాలపై కూడా భారత్ డీఏపీ, భారత్ 20-20-0-13 అని వస్తుందంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తెలిసేలా..
రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండు పం టలకు ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున సంవత్సరానికి రూ.10వేలు రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథ కం ద్వారా ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సన్న, చిన్న కారు రైతులకు ఐదు ఎకరాల లో పు ఎన్ని ఎకరాలు ఉన్నా సంవత్సరానికి రూ.6వేలు మాత్రమే ఇస్తోంది. కుటుంబంలో ఒకరికే ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వం యూరియా, కాంప్లెక్స్ ఎరువుల పై భారీగా సబ్సిడీ ఇస్తున్నప్పటికీ, తాము ఇస్తున్న సబ్సిడీ ఎంత అన్నది రైతులకు బోధపడటం లేదన్నది కేంద్ర ప్రభుత్వ భావన. దీంతో రాష్ట్ర ప్రభుత్వ రైతుబంధు పథకం బహుళ ప్రాచుర్యం పొందడంతో కేంద్ర ప్రభుత్వం తను ఎరువులపై ఇస్తున్న సబ్సిడీ రైతులు తెలుసుకునేలా యూరియా బస్తాపై యూరియా వాస్తవ ధర రూ.2715.19పైసలు, అందు లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.2448.69పైసలు ఇచ్చి రైతులకు రూ.266.50 పైసలకు అందిస్తున్నట్లు స్పష్టంగా తెలిసేలా ముద్రిస్తున్నారు. గతంలో కూడా యూరియా బస్తాలపై అమ్మకం ఽధర మాత్రమే ఉండేది. ప్రభుత్వ సబ్సిడీ ఉండకపోయేది. ఒక్కో రైతు ఒక్కో పంటకు ఎకరాకు రెండు బస్తాల యూరియా వేస్తాడు. రెండు బస్తాలకు రూ.4,897.38పైసలు కేంద్ర ప్రభు త్వం లబ్ధి చేకూర్చుతున్నట్లే కదా అంటున్నారు. కాంప్లెక్స్ బస్తాలపైన కూడా భారీగానే (డీఏపీపై రూ.2421.65పైసలు సబ్సిడీ ఇస్తోంది. ప్రతీ రైతు ప్రత పంటకు ఎకరాకు రెండు బస్తాల డీఏపీ వేస్తాడు. డీఏపీపై కూ డా ఎకరాకు రూ.4843.30 పైసలు సబ్సిడి ఇస్తున్నది. యూరియా, కాంప్లెక్స్‌పై కలిపి ఎకరాకు రూ.9,749.68 పైసలు సబ్సిడీ రూపేణా రైతులకు అందుతున్నదని తెలియజెప్పే ప్రయత్నమే ఇది అంటున్నారు.
కంపెనీ బస్తానే అడిగి తీసుకుంటారు : యానాల దామోదర్‌రెడ్డి, రైతు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు
కేంద్ర ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకొచ్చిన భారత్ యూరియాతో రైతులకు ఒనగూరే అదనపు ప్ర యోజనమేమీ ఉండదు. అన్ని కంపెనీలు తయారు చేసే యూరియాలో 46 శాతం నత్రజనే ఉన్నప్పటికీ పని చేసే విధానంలో కొంత తేడా ఉంటుంది. భారత్ యూరియా బస్తాలపై కంపెనీ పేరు ఉంటున్నందున రైతులు ఇప్పుడు కూడా ఆ కంపెనీ యూరియా బస్తానే అడిగి తీసుకుంటారు. పేరున్న కంపెనీలు లింక్‌లు పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి బస్తాల మార్పుతో ఒరిగేదేమి ఉండదు.