స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ప్రణాళికబద్ధంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-10T06:01:03+05:30 IST

జిల్లాలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ప్రణాళికబద్ధంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు.

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ప్రణాళికబద్ధంగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైన కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అధికారులు

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ 

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఆగస్టు 9 : జిల్లాలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ప్రణాళికబద్ధంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్పీతో పాటు ఇతర అధికారులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్‌ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలకు కలెక్టర్‌ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ నెల 10న ప్రతి గ్రామం, మునిసిపాలిటి పరిధిలో ఫ్రీడమ్‌ పార్కు కింద కనీసం 75 మొక్కలు నాటాలని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. రోజు వారీ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తామని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌, అదనపు కలెక్టర్లు పాటిల్‌ హేమంత్‌కేశవ్‌, ఎస్‌.మోహన్‌రావు, సీఈవో సురేష్‌, డీఎ్‌ఫవో ముకుందారెడ్డి, డీఆర్‌డీవో సుందరి కిరణ్‌కుమార్‌, డీపీవో యాదయ్య పాల్గొన్నారు. 

వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలి

సూర్యాపేటటౌన్‌:జిల్లాలో నిర్వహించే స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ కార్యాలయంలో 75వ స్వాత్రంత్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణతో కలసి ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. జిలాలో 13రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, వైస్‌చైర్మన్‌ పుట్ట కిశోర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

సినిమా తిలకించిన అధికారులు, నాయకులు, విద్యార్థులు

వజ్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు జిల్లా కేంద్రంలోని నవ్య సినిమా థియేటర్‌లో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మహాత్మాగాంధీ చిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో అదనపు కల్టెకర్‌ పాటిల్‌హేమంత్‌కేశవ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణతో కలసి చిత్రప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో అశోక్‌, ఎడీ శైలజ, మునిసిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

వజ్రోత్సవ కరపత్రాల ఆవిష్కరణ

సూర్యాపేటక్రైం:  ఆజాదీకా అమృత్‌, 75 స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల కరపత్రాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ఆవిష్కరిం చారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం, పట్టణ సీఐ రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T06:01:03+05:30 IST