ప్రజావాణి సమస్యలకు అధిక ప్రాధాన్యమివ్వాలి

ABN , First Publish Date - 2022-06-28T06:38:57+05:30 IST

ప్రజావాణికి ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించా రు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుం చి వచ్చిన ప్రజలు అందజేసిన ఫిర్యాదులు, వినతులను కలెక్టర్‌ రాహుల్‌శర్మ, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ స్వీకరించారు.

ప్రజావాణి సమస్యలకు అధిక ప్రాధాన్యమివ్వాలి
ప్రజావాణిలో వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

నల్లగొండ టౌన్‌, జూన్‌ 27: ప్రజావాణికి ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించా రు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుం చి వచ్చిన ప్రజలు అందజేసిన ఫిర్యాదులు, వినతులను కలెక్టర్‌ రాహుల్‌శర్మ, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను వెంటనే పరిష్కరించేందుకు వాటిని సంబంధిత శాఖలకు పంపినట్లు తెలిపారు. వివిధ శాఖలకు చెందిన 54 అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. గతంలో పెండింగ్‌లో ఉన్న అర్జీలను సైతం పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కాళింది ని, మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T06:38:57+05:30 IST