కొత్త ఏడాది సుఖసంతోషాలు నెలకొనాలి

ABN , First Publish Date - 2022-12-31T23:17:10+05:30 IST

కొత్త సంవత్సరం ప్రజలందరికీ కలిసి రావాలని, సుఖసంతోషాలు వారి జీవితాల్లో నెలకొనాలని అదనపు కలెక్టర్‌ మోహనరావు ఆకాంక్షించారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయన కేక్‌కట్‌ చేసి పంపి

కొత్త ఏడాది సుఖసంతోషాలు నెలకొనాలి
సూర్యాపేటలోని కలెక్టరేట్‌లో కేక్‌కట్‌ చేస్తున్న అదనపు కలెక్టర్‌ మోహనరావు

సూర్యాపేట టౌన / మద్దిరాల/ చిలుకూరు / హుజూర్‌నగర్‌ / మునగాల రూరల్‌, డిసెంబరు 31 : కొత్త సంవత్సరం ప్రజలందరికీ కలిసి రావాలని, సుఖసంతోషాలు వారి జీవితాల్లో నెలకొనాలని అదనపు కలెక్టర్‌ మోహనరావు ఆకాంక్షించారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయన కేక్‌కట్‌ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏవో శ్రీదేవితో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మద్దిరాల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. చిలుకూరు మండలకేంద్రంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ కొడారు బాబు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి శోభనబాబు, ధర్మయ్యగౌడ్‌ పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌ పట్టణంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కేక్‌కట్‌ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మునగాల మండలం ముకుందాపురం గ్రామంలోని ఇందిరా వృద్ధాశ్రమంలో కోదాడకు చెందిన ఎనఆర్‌ఎం పాఠశాల విద్యార్థులు వృద్ధులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన చంద్రం వాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:17:13+05:30 IST