గన్నీ బస్తాలను కాల్చివేసిన గుర్తుతెలియని వ్యక్తులు

ABN , First Publish Date - 2022-12-16T01:33:55+05:30 IST

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం జల్మాల్‌కుంట తండాలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం తెల్లవారు జామున గన్నీ బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు.

గన్నీ బస్తాలను కాల్చివేసిన గుర్తుతెలియని వ్యక్తులు

పెన్‌పహాడ్‌, డిసెంబరు 15: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం జల్మాల్‌కుంట తండాలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం తెల్లవారు జామున గన్నీ బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. ఏఎస్‌ఐ వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. ఐకేసీ కేంద్రంలో రెండు బండిల్‌లో ఉన్న రూ.70వేల విలువ చేసే 1000 నూతన గన్నీ బస్తాలను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. ఈ విషయాన్ని నిర్వాహకులు ఎపీఎం అజయ్‌నాయక్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై వీబీకే శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-12-16T01:33:56+05:30 IST