బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి

ABN , First Publish Date - 2022-11-23T23:38:05+05:30 IST

దేవరకొండ నియోజకవర్గంలోని గిరిజనతండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ కోరారు.

బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి
హైదరాబాద్‌లో సీఎంను కలిసిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

సీఎంను కోరిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

దేవరకొండ, నవంబరు 23 : దేవరకొండ నియోజకవర్గంలోని గిరిజనతండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ కోరారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. రవీంద్రకుమార్‌కు సీఎం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీటీరోడ్ల కోసం నిధులివ్వాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు.

Updated Date - 2022-11-23T23:38:05+05:30 IST

Read more