హక్కులను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు
ABN , First Publish Date - 2022-12-15T00:11:20+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయని బహుజన కార్మి క సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాస్ అన్నారు.
సూర్యాపేట అర్బన్, డిసెంబరు 14: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయని బహుజన కార్మి క సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పబ్లిక్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన బహుజన కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడారు. కార్మికులకు పీఎఫ్ చెల్లించాలని, 50 ఏళ్లు నిండిన కార్మికులందరికీ రూ.6,000 పింఛన్, ప్రమాదంలో కార్మికు లు మృతిచెందితే వారి కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశం మొత్తం కార్మికలోకం సమస్యల్లో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో కొత్తబస్టాండ్ నుంచి పట్టణ ప్రధాన వీధుల మీదుగా పబ్లిక్‌క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం లో నాయకులు మధుమహారాజ్, నర్సయ్య, రాంబాబు, యాకయ్య, మహేష్, రమేష్, నరేష్, చెన్నయ్య, వెంకన్న పాల్గొన్నారు.