హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలం

ABN , First Publish Date - 2022-03-05T06:33:43+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని డీసీసీ అధ్యక్షుడు కుం భం అనిల్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలం
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

డీసీసీ అధ్యక్షుడు  కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

యాదాద్రి, మార్చి4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని డీసీసీ అధ్యక్షుడు కుం భం అనిల్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. భువనగిరిలో కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులన్నింటికీ టీఆర్‌ఎస్‌ మద్దతు పలికి, మరోవైపు ఆందోళనలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నా రు. రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్‌ సంస్కరణల బిల్లులపై కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించి,  కేంద్ర విధానాలపై టీఆర్‌ఎస్‌ విమర్శలు చేయడం ఓ డ్రామా అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో ఆ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. 

ఉద్యోగాల భర్తీ, యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, రైతులకు రుణమాఫీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా అతీగతీలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. పార్టీ డిజిటల్‌ సభ్యత్వాలను వేగవంతంగా పూర్తిచేయాలని, భువనగిరి నియోజకవర్గంలో నెలాఖరులోగా 50వేల సభ్యత్వాల పూర్తికి కృషి చేయాలన్నారు. సభ్యత్వాలపై జిల్లా వ్యాప్తంగా 15రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, బీసుకుంట్ల సత్యనారాయణ, కె.సోమయ్య, కోట పెద్దస్వామి, ఆదినారాయణ. నుచ్చు నాగయ్య, చిక్కుల వెంకటేశ్‌, బర్రె జహంగీర్‌, సామల ధర్మరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:33:43+05:30 IST