చేనేత సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-10-01T06:01:45+05:30 IST

చేనేత కార్మికుల సంక్షేమాని కి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అఖిలభారత పద్మశాలి రాజకీయ విభా గం అధ్యక్షుడు బోళ్ల శివశంకర్‌ అన్నారు.

చేనేత సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
సమావేశంలో మాట్లాడుతున్న బొల్లా శివశంకర్‌

సంస్థాన్‌ నారాయణపురం, సెప్టెంబరు 30: చేనేత కార్మికుల సంక్షేమాని కి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అఖిలభారత పద్మశాలి రాజకీయ విభా గం అధ్యక్షుడు బోళ్ల శివశంకర్‌ అన్నారు. నేతన్నల ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవా రం మండలంలోని పుట్టపా క గ్రామంలో పర్యటించారు. గడప గడపకూ తిరిగి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంత రం మాట్లాడుతూ చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండ గా ఉంటోందన్నారు. చేనేతపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమం చేనేత అవార్డు గ్రహీతలు పొలం బుచ్చిరాములు, కొలను వెంకయ్య, అయిటిపాముల నీరజ, గూడ శీను, భాస్కర్‌, గజేందర్‌, సాయికిషోర్‌, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలి

చౌటుప్పల్‌ రూరల్‌: సంక్షోభంలో ఉన్న చేనేతరంగాన్ని ఆదుకోవాలని కొయ్యలగూడెం చేనేత సహకార సంఘం చైర్మన్‌ గడ్డం జయశంకర్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని కొయ్యలగూడెంలో శుక్రవారం నిర్వహించిన చేనేత సహకా రం సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాతో దెబ్బతిన్న చేనేతరంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేసి సంఘాన్ని లాభాలో బాటలో నడిపించేందుకు కార్మికులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జెల్లా ఈశ్వరమ్మ, నాయకులు మాచర్ల కృష్ణ, గడ్డం నర్సింహ, జెల్ల వెంకటేశం, గుర్రం వెంకటేశ్వర్లు, ఏలే భాస్కర్‌, పొట్టబత్తిని ఉపేందర్‌, రవ్వ సంతోష్‌, గంజి మార్కండయ్య, పొట్టబత్తిని హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Read more