గోదావరి, కృష్ణాజలాలు అందించాలి : సీపీఎం
ABN , First Publish Date - 2022-08-19T06:00:59+05:30 IST
మూసీ జలాల కాలుష్యం నుంచి విముక్తి కోసం మూసీ ఆయకట్టు ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా కృష్ణా, గోదావరిజలాలు అందిం చాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమా ండ్ చేశారు.

భూదాన్‌పోచంపల్లి /భువనగిరి టౌన్/ రామన్నపేట ఆగస్టు 18: మూసీ జలాల కాలుష్యం నుంచి విముక్తి కోసం మూసీ ఆయకట్టు ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా కృష్ణా, గోదావరిజలాలు అందిం చాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమా ండ్ చేశారు. ఈ నెల 22, 23వ తేదీల్లో నిర్వహిస్తున్న సీపీఎం పోరు యాత్ర పోస్టర్లను గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆవిష్క రించారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని విషపునీరు కమ్మేసిందని ఏళ్ల తరబడి గత్యంతరం లేక ప్రజలు ఈ నీటినే వాడుతున్నారన్నారు. విషతుల్యమైన మూసీ జలాలతో ఇక్కడి పంటలు హరించి పోతున్నాయని, ప్రజారోగ్యం, పశువులు, మత్స్య సంపద, జీవజాలం మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పగిల్ల లింగారెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, నాయకులు గూడూరు అంజిరెడ్డి, కోట రాంచంద్రారెడ్డి, మంచాల మధు, నెలికంటి జంగయ్య, రామసాని అనిల్‌రెడ్డి, దుబ్బాక జగన్, యాదగిరి, గంగదేవి సాయినాథ్ పాల్గొన్నారు. భువనగిరిలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యు రాలు భట్టుపల్లి అనురాధ మాట్లాడారు. పెరిగిన మూసీ కాలుష్యంతో పంటలు కలుషితం అవుతున్నాయని పరీవాహక ప్రాంత ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి యామ కృష్ణ, కోటగిరి వీరబ్రహ్మం, ఆకుల రాములు, నీలం పెంటయ్య, చిట్టెమ్మ, యశోద పాల్గొన్నారు. జిల్లాకు గోదావరి, కృష్ణాజ లాల సాధన కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి పోరు యాత్ర పోస్టర్లను సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మేక అశోక్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, నాగటి ఉపేందర్, గాదె నరే ందర్, బల్గూరి అంజయ్య, రాపోలు ప్రభాకర్, దోమలపల్లి నర్సింహ, మునుకుంట్ల లెనిన్, దేవరపల్లి భిక్షంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.