ముదిమాణిక్యం మేజర్‌కు గండి

ABN , First Publish Date - 2022-04-05T06:24:14+05:30 IST

మండలంలోని అంజనపల్లి శివారులో ముదిమాణిక్యం మేజర్‌ కాల్వ కు 13 కిలో మీటరు వద్ద ఆదివారం రాత్రి గండి ప డింది.

ముదిమాణిక్యం మేజర్‌కు గండి
ముదిమాణిక్యం మేజర్‌కు గండి పడిన దృశ్యం

త్రిపురారం, ఏప్రిల్‌ 4: మండలంలోని అంజనపల్లి శివారులో ముదిమాణిక్యం మేజర్‌ కాల్వ కు 13 కిలో మీటరు వద్ద ఆదివారం రాత్రి గండి ప డింది. రైతుల నుంచి స మాచారం అందుకున్న అధికారులు వెంటనే నీటి ని నిలిపివేశారు. వరి పంట కోతకు రావడంతో నీటి వినియోగం తగ్గి పైభాగంలో తూములు కట్టి వే యడంతో కాల్వ కట్ట కోతకు గురైందని, పంటలకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. త్రిపురారం ఎన్నెస్పీ సబ్‌ డివిజన డీఈ కేశవ్‌, జేఈఈ శ్రీనివా్‌సరావు, వర్క్‌ ఇనస్పెక్టర్‌ బొల్లిగొర్ల శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకు ని గండిని పరిశీలించారు. యుద్ధ ప్రాతిదికన మరమ్మతులు చేపట్టారు. 


Updated Date - 2022-04-05T06:24:14+05:30 IST