వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం
ABN , First Publish Date - 2022-10-17T06:11:32+05:30 IST
మట్టపల్లి క్షేత్రంలో నృసింహుడి నిత్యకల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగరణం, పంచగవ్యప్రాసన, మాంగళ్యధారణ, తలంబ్రాల తంతును అర్చకులు నిర్వహించారు.
మఠంపల్లి, అక్టోబరు 16: మట్టపల్లి క్షేత్రంలో నృసింహుడి నిత్యకల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగరణం, పంచగవ్యప్రాసన, మాంగళ్యధారణ, తలంబ్రాల తంతును అర్చకులు నిర్వహించారు. అనంతరం మహానివేదన చేసి భక్తులకు వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో సిరికొండ నవీన్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.