గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి

ABN , First Publish Date - 2022-10-07T05:48:31+05:30 IST

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చే స్తుందని ఇందులో భాగంగా కొత్త గ్రంథాలయాలతో పాటు ప్రస్తుత ఉన్న గ్రంథాలయాలన్నింటికీ నిధులను కేటాయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన రేగట్టె మల్లికార్జునరెడ్డి మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
మంత్రి కేటీఆర్‌ను కలిసిన గ్రంథాలయ సంస్థ చైర్మన రేగట్టె మల్లికార్జునరెడ్డి

మంత్రి కేటీఆర్‌కు రేగట్టె వినతి 

నల్లగొండ, అక్టోబరు 6: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చే స్తుందని ఇందులో భాగంగా కొత్త గ్రంథాలయాలతో పాటు ప్రస్తుత ఉన్న గ్రంథాలయాలన్నింటికీ నిధులను కేటాయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన రేగట్టె మల్లికార్జునరెడ్డి మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌కు వెళ్లిన సందర్భంగా ఆయన మంత్రికి గ్రంథాలయాల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశా రు. తాను బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రంథాలయాల వారీగా సమీక్షలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ గ్రంథాలయాల అ భివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని, భవిష్యత్తులో కూడా నిధుల కొరత రా కుండా చూస్తానని హామీ ఇచ్చారు. 


Read more