పండ్ల తోటల రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-12-07T00:23:55+05:30 IST

ప్రకృతి వైఫరీత్యాలతో ప్రతి ఏటా నష్టపో తున్న పండ్ల తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై. వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు.

పండ్ల తోటల రైతులను ఆదుకోవాలి
రామాపురంలో పండ్ల తోటలు పరిశీలిస్తున్న రైతు సంఘం నాయకులు

నడిగూడెం, డిసెంబరు 6: ప్రకృతి వైఫరీత్యాలతో ప్రతి ఏటా నష్టపో తున్న పండ్ల తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై. వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు. మండలంలోని రామా పురంలో గ్రామంలో పండ్ల తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి దిగుబడి వస్తే ధర లేక, ధర ఉంటే తెగుళ్లతో దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జిల్లాకేంద్రంలో మామిడి మా ర్కెట్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఫలసాగర్‌ పథకాన్ని పునరుద్ధరించాలని, వా తావరణ ఆధారిత బీమా వర్తింపజేయాలన్నారు. రాయితీపై ఎరువులు, విత్త నాలు అందించాలని డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహా రం అందించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఈద వెంకట రెడ్డి, చిన్నకోటిరెడ్డి, ములగ గోవిందు, మధు, చారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:23:59+05:30 IST