మున్నూరుకాపులు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-05-30T06:17:52+05:30 IST

మున్నూరు కాపులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా రాణించాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి ఆకుల నగేష్‌ అన్నారు.

మున్నూరుకాపులు అన్ని రంగాల్లో రాణించాలి
పాతగుట్టలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌రావు

యాదగిరిగుట్ట రూరల్‌, మే 29: మున్నూరు కాపులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా రాణించాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి ఆకుల నగేష్‌ అన్నారు. ఆదివారం గుట్ట మునిసిపల్‌ పరిధిలోని పాతగుట్టలో నిర్వహించిన ఆ సంఘం రాష్ట్ర మహాసభలో వారు మాట్లాడారు. రెండు శతాబ్దాల క్రితం తమ మహాసభ ఏర్పడి మున్నూరు కాపుల అభ్యన్నతికి కృషి చేస్తోందన్నారు. మహాసభ ఆధ్వర్యంలో మున్నూరు కాపు విద్యార్థులకు ఉచిత  విద్యకు ఆర్థికసాయం, హైదరాబాద్‌ వసతి గృహాల సౌలభ్యం, పేద మహిళల వివాహాలకు పుస్తె, మెట్టెలు, పట్టుచీర ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఎన్నికల్లో మున్నూరు కాపు అభ్యర్థులు నిలబడితే పార్టీలతో సంబంధం లేకుండా మద్దతు ఇస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాధునేని మధుకర్‌, చెరిగె శ్రీనివాస్‌, రావుల రాజు పాల్గొన్నారు.
Read more