మత్స్యకార్మికుల సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2022-10-04T05:30:00+05:30 IST

మత్స్యకార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్‌ లచ్చిరాం భూక్య అన్నారు.

మత్స్యకార్మికుల సంక్షేమానికి పెద్దపీట



 మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్‌ లచ్చిరాం భూక్య 

భువనగిరి రూరల్‌, అక్టోబరు 4: మత్స్యకార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్‌ లచ్చిరాం భూక్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మత్స్యకార్మికులు ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో ఎం.రాజారాం, మత్స్యకార్మికుల సంఘం ప్రతినిధులు నర్ల నర్సింగ్‌ రావు, లక్ష్మయ్య, సత్తయ్య, నర్ల కుమార్‌, పబ్బ శ్రీనివాస్‌, పూస మైసయ్య, మత్స్యశాఖ అధికారి రవినాయక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-04T05:30:00+05:30 IST