అక్రమ రవాణాపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2022-08-04T05:38:25+05:30 IST

పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా, గంజాయి, గుట్కా రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

అక్రమ రవాణాపై దృష్టి సారించాలి

పాలకవీడు, ఆగస్టు 3:  పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా,  గంజాయి, గుట్కా  రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.  బుధవారం పాలకవీడు పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ముందుగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు.  పాలకవీడు మండలం ఆంధ్రా సరిహద్దులో ఉన్నందున అక్రమ రవాణాపై పోలీసులు నిరంతరం అప్రమత్తంగాఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్‌ సీఐ రామలింగారెడ్డి, ఎస్‌ఐ సైదులుగౌడ్‌, సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2022-08-04T05:38:25+05:30 IST