ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2022-07-05T05:59:07+05:30 IST

వ్యవసాయ విధానాలు, రెట్టింపు ఆదాయ మార్గాలపై రైతులు దృష్టి సారించాలని మేనేజ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.లక్ష్మీ మనోహరి సూచించారు. సేంద్రియ వ్యవసాయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌) హైదరాబాద్‌ సహకారంతో మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో మూడు రోజుల శిక్షణపై సోమవారం వర్చువల్‌గా మాట్లాడారు.

ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలి
సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న మేనేజ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీమనోహరి

గరిడేపల్లి, జూలై 4: వ్యవసాయ విధానాలు, రెట్టింపు ఆదాయ మార్గాలపై రైతులు దృష్టి సారించాలని మేనేజ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.లక్ష్మీ మనోహరి సూచించారు. సేంద్రియ వ్యవసాయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌) హైదరాబాద్‌ సహకారంతో మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో మూడు రోజుల శిక్షణపై సోమవారం వర్చువల్‌గా మాట్లాడారు. సమగ్ర వ్యవసాయ విధానాలు, రైతులు ఆదాయం రెట్టింపు పంటలు ఎంచుకోవాలని సూచించారు. రసాయన ఎరువు లు వాడడం ద్వారా భూమి కలుషితం అవుతుందని, సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమి ఆరోగ్యంతో పాటు, ప్రజల ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పెట్టుబడి తగ్గుతుందని, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు వాడకం ద్వారా భూసారం పెరుగుతుందని తెలిపారు. పాడి పశువులు పెంచితే పాలతో పాటు పశువుల ఎరువులు తయారు చేసుకొని పొలంలో ఉపయోగించుకుంటూ భూసారం పెంచవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్‌ ఏడీఏ పి.సంధ్యారాణి, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ ఇన్‌చార్జి బి.లవకుమార్‌, శాస్త్రవేత్తలు ఏ.కిరణ్‌, డి.నరేష్‌, డి. ఆదర్శ్‌, టి. మాధురి, ఎన్‌.సుగంధి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T05:59:07+05:30 IST