వడాయిగూడెంలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2022-03-05T06:23:09+05:30 IST

బాణాసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తు ఓ వెంచర్‌లోని కంప చెట్ల లో పడి మంటలు చెలరేగిన సంఘటన మండలంలోని వడాయిగూడెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

వడాయిగూడెంలో అగ్ని ప్రమాదం

భువనగిరి రూరల్‌, మార్చి4: బాణాసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తు ఓ వెంచర్‌లోని కంప చెట్ల లో పడి మంటలు చెలరేగిన సంఘటన మండలంలోని వడాయిగూడెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అఖండ జ్యోతి శోభాయాత్రలో బాణసంచా కాల్చడంతో పక్కనే ఉన్న వెంచర్‌లో గల కంపచెట్లలో నిప్పు రవ్వలు పడి మంటలు చెలరేగాయి. యాదగిరిగుట్ట నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.


Read more