ప్రపంచ శాంతి కోసం పోరాడాలి
ABN , First Publish Date - 2022-08-04T05:42:27+05:30 IST
ప్రపంచ శాంతి కోసం ప్రజలు పోరాడాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్(కప్పల వెంకటేశ్వర్లు) అన్నారు.
సూర్యాపేటఅర్బన్, ఆగస్టు 3: ప్రపంచ శాంతి కోసం ప్రజలు పోరాడాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్(కప్పల వెంకటేశ్వర్లు) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ధర్మబిక్షం భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, వ్యక్తిస్వేచ్ఛ, స్వాతంత్ర హక్కులకు భంగం వాటిల్లుతోందన్నారు. యుద్దోన్మాదం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు దొడ్డ వెంకటయ్య, బూర వెంకటేశ్వర్లు, బొమ్మగాని శ్రీనివాస్, శంకర్, సదాశివరెడ్డి, సత్యం, రాము, కృష్ణ, వెంకట్‌రెడ్డి, రవి, శ్రీకాంత్, వెంకన్న, చంద్రయ్య పాల్గొన్నారు.