భక్తిశ్రద్ధలతో పీర్ల పండుగ

ABN , First Publish Date - 2022-08-10T05:46:30+05:30 IST

భువనగిరి మండలంలోని మన్నెవారిపంపు, బీఎన.తిమ్మాపురం, వడపర్తి, తుక్కాపురం, బొల్లేపల్లి, సూరేపల్లి, బస్వాపురం తదితర గ్రామాల్లో మంగళవారం పీర్లను ఊరేగించి పీర్ల పండుగ(మొహర్రం)ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో పీర్ల పండుగ
భూదానపోచంపల్లిలో పీర్లను ఊరేగిస్తున్న స్థానికులు

ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్‌: భువనగిరి మండలంలోని మన్నెవారిపంపు, బీఎన.తిమ్మాపురం, వడపర్తి, తుక్కాపురం, బొల్లేపల్లి, సూరేపల్లి, బస్వాపురం తదితర గ్రామాల్లో మంగళవారం పీర్లను ఊరేగించి పీర్ల పండుగ(మొహర్రం)ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు జనగాం పాండు, ర్యాకల శ్రీనివాస్‌, సిల్వేరు మధు, ఆయా గ్రామాల సర్పంచలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  వలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో మొహర్రం  వేడుకలు ఘనంగా జరిగాయి. పీర్లకు దట్టీలు కట్టి భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. సాయంత్రం పీర్లను సంప్రదాయ బద్ధంగా సాగనంపారు. కార్యక్రమంలో ప్రజా  ప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మోత్కూరు మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో  హిందువులు, ముస్లింలు కలిసి పీర్లను ఎత్తుకుని డప్పు చప్పుళ్లతో వీధుల్లో తిరిగారు.  అనేక మంది భక్తులు పీర్లకు దట్టీలు కట్టి, డబ్బులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. పాటిమట్లలో ఆల్డా చైర్మన మోతె పిచ్చిరెడ్డి, మదర్‌ డెయిరీ డైక్టర్‌ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ మల్లేష్‌ తదితరులు పీర్ల కొట్టంలో మొక్కులు చెల్లించారు. మోటకొండూరులో జరిగిన వేడుకల్లో డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌ రెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు బొట్ల యాదయ్య, కో ఆప్షన సభ్యుడు ఎండి.బురాన, జంగారెడ్డి పాల్గొన్నారు. ఆలేరు మండలంలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన వస్పరి శంకరయ్య, వైస్‌చైర్మన మొరిగాడి మాధవి వెంకటేష్‌, సింగిల్‌ విండో చైర్మన మల్లేశం, ఎస్‌ఐ ఇద్రీస్‌ అలీ, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పుట్ట మల్లేష్‌, పంతం కృష్ణ పాల్గొన్నారు. గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో దామోదర్‌, శ్రీరాములు, యాదగిరి, నరేష్‌, మేనొద్ధీన, యాదయ్య, రాజయ్య, యాదగిరి పాల్గొన్నారు. సంస్థాన నారాయణపురం, ఆత్మకూరు(ఎం), యాదగిరిగుట్ట, పోచంపల్లి మండలాల్లో మొహర్రం వేడుకలను నిర్వహించారు.

Updated Date - 2022-08-10T05:46:30+05:30 IST