విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2022-10-02T05:53:25+05:30 IST

తుంగతుర్తి మండలంలో విద్యుదాఘాతానికి గురై రైతు శనివారం మృతి చెం దాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దపరుశరామలు మృతదేహం

తుంగతుర్తి, అక్టోబరు 1 : తుంగతుర్తి మండలంలో విద్యుదాఘాతానికి గురై రైతు శనివారం మృతి చెం దాడు. ఎస్‌ఐ డానియేల్‌, రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగూడెం గ్రామానికి చెందిన గుండగాని పెద్దపరుశరామలు(55) శనివారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు పశువులను తీసుకెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి ఇం టికి రాకపోవడంతో ఆయన పెద్దకుమారుడు మనోజ్‌ పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే మోటార్‌ వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెంది కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. పెద్దపరుశరాములుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య ఉపేంద్ర ఫిర్యాదు మేరకు పరుశరాములు మృతదేహాన్ని తుంగతుర్తి ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Read more