మద్యం, డబ్బుతో రాజకీయాలు మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళీ

ABN , First Publish Date - 2022-11-03T01:10:24+05:30 IST

రాష్ట్రంలో రాజకీయాలు మద్యం డబ్బుతో కొనసాగుతున్నాయని మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళీ అన్నారు.

మద్యం, డబ్బుతో రాజకీయాలు  మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళీ

సూర్యాపేటఅర్బన్‌, నవంబరు 2: రాష్ట్రంలో రాజకీయాలు మద్యం డబ్బుతో కొనసాగుతున్నాయని మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళీ అన్నారు. జిల్లా కేంద్రంలోని జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ ఉచిత విద్య, వైద్యం అమలు చేసేవరకు ప్రజలను చైతన్యవంతం చేస్తానన్నారు. పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించేంత వరకు సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం ద్వారా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు వీరబోయిన లింగయ్య, బారి అశోక్‌, తగుళ్ల జనార్థన్‌ యాదవ్‌, బంటు సందీప్‌, గుండాల సందీప్‌, ప్రవీణ్‌, సూర్య, మాండ్ర మల్లయ్యయాదవ్‌, పృథ్వీరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T01:10:24+05:30 IST
Read more