‘ఉపాధి’కి కసరత్తు

ABN , First Publish Date - 2022-11-27T23:45:29+05:30 IST

ఉపాధిహామీ పథకం కింద గ్రామీణప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. గ్రామాల్లో ఏ పనులు చేపట్టాలన్న దానిపై డీఆర్డీడీ ఏ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వివిధ శాఖల సమన్వయంతో పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘ఉపాధి’కి కసరత్తు
ఉపాధిపనులు చేపడుతున్న కూలీలు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30.99లక్షల పనిదినాలు

బడ్జెట్‌ రూ.79.64కోట్లు

గ్రామాలవారీగా పనుల గుర్తింపు

అంచనాలు రూపొందిస్తున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి)

ఉపాధిహామీ పథకం కింద గ్రామీణప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. గ్రామాల్లో ఏ పనులు చేపట్టాలన్న దానిపై డీఆర్డీడీ ఏ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వివిధ శాఖల సమన్వయంతో పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో గ్రామ సభలు నిర్వహిం చి, పనుల జాబితాను రూపొందిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతీ సం వత్సరం కూలీలకు తగ్గట్టుగా నైపుణ్యంలేని పనులను, గ్రా మానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన తదితర పనులను గుర్తించి బడ్జెట్‌ను రూపొందిస్తారు. అయితే ఈ పథకం కింద అన్ని గ్రామాలు, మండలాల్లో భాగస్వామ్య పద్ధతిలో ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో జిల్లాలో గ్రామసభల ద్వారా పనులు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం పనులు గుర్తించేందుకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, సా గు, తాగునీరు శాఖలు, పంచాయతీరాజ్‌ శాఖల పనులను గుర్తిస్తున్నారు. ఉపాధి పనులు గుర్తింపు సమయంలో సంబంధిత శాఖల సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులై, ప్రణాళిక రూపకల్పనకు సహకారం అందిస్తున్నారు.

చేపట్టనున్న పనులు

ఉపాధి హామీ పథకం కింద సీసీరోడ్లు, మెటల్‌రోడ్లు వే సేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. గ్రామాల్లో ఉపా ధి పనులు చేపట్టే భూములకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. నీటి సంరక్షణ, నీటినిల్వ, అడవు ల పెంపకం, మొక్కలు నాటడటంతోపాటు కరువు నివార ణ పనులు, సూక్ష్మ, చిన్నతరహా సాగు నీటి పనులను కలుపుకుని కాల్వల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ సభల్లో పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, డీ ఆర్‌డీవో అధికారులు పాల్గొంటున్నారు. రైతులతో, కూలీల తో చర్చించి, మండలాలవారీగా గ్రామసభలు పూర్తిచేసి, గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై పూర్తిస్తాయి నివేదికను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సహజ వ నరుల కింద నీటి నిల్వ కందకాలు, మట్టికట్టలు, విడి రాళ్లకట్టుట,బంజరుభూముల్లో,రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాట డంపనులు చేపట్టేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు.

జిల్లాలో మొత్తం 421 గ్రామ పంచాయతీలు

జిల్లాలో మొత్తం 17 మండలాల్లో మొత్తం 421 గ్రామపంచాయతీలున్నాయి. ఈ పథకం కింద పనులు చేపట్టేందుకు జిల్లావ్యాప్తంగా జాబ్‌కార్డులను జారీచేశారు. 30, 99,118 పనిదినాలకు కూలీలకు రూ.79,64,73,326 బడ్జెట్‌ ను రూపకల్పన చేశారు. అయితే మెటీరియల్‌ సంబంధిత నిధులు అదనం. గ్రామాల్లో గుర్తించిన పనులను చేపట్టేందుకు అవసరమయ్యే నిధులపై అధికారులు గ్రామాలవారీ గా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో 1.65లక్షల జాబ్‌కార్డులుండగా, 3.48లక్షల మంది కూలీలు ఉన్నారు.

60శాతం నిధులు తగ్గకుండా

గ్రామంలో నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా కనీసం 60శాతం నిధులకు తక్కువగా కాకుండా మండలస్థాయిలో వ్యవసాయ సంబంధిత పను లు గుర్తించాలి. ప్రాధాన్యతా క్రమంలో గ్రామాల్లో మొక్కల పెంపకం, ఉద్యానవనాల నిర్వహణ, గెట్లపై మొక్కల పెంపకం, లింకు రోడ్లు, కాల్వల మరమ్మతులు వంటి మౌలిక సదుపాయాల కల్పన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గుర్తించిన పనుల జాబితాను గ్రామసభ తీర్మానాల నఖలును గ్రామపంచాయతీ నోటీ్‌సబోర్డుపై అతికించాలి. అనంతరం గుర్తించిన పనికి ఆశించిన ప్రయోజనం, ఫలితాలను కూడా పొందుపర్చాలి. 2023-24 సంవత్సరంలో చేపట్టనున్న పనుల పై అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఉపాధి పనుల ప్రణాళికను రూపొందిస్తున్నాం : మందడి ఉపేందర్‌రెడ్డి, డీఆర్డీవో

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాఽ ది హామీ పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూలీలను ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గ్రామాలవారీగా చేపట్టనున్న పనులపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పనులను గుర్తిస్తున్నాం.కూలీలకు ఉపాధితతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందు కు కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. అన్ని పనులను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నాం.

మండలం పనిదినాలు

అడ్డగూడూరు 1,42,747

ఆలేరు 1,38,716

ఆత్మకూరు(ఎం) 1,97,998

భువనగిరి 2,82,539

బీబీనగర్‌ 1,00,874

బొమ్మలరామారం 1,52,961

చౌటుప్పల్‌ 2,15,000

గుండాల 2,13,754

తుర్కపల్లి 2,14,300

మోటకొండూరు 1,41,133

మోత్కూరు 1,11,372

నారాయణపురం 2,64,201

భూదాన్‌పోచంపల్లి 1,23,250

రాజపేట 2,21,500

రామన్నపేట 1,82,500

వలిగొండ 2,46,923

యాదగిరిగుట్ట 1,49,350

Updated Date - 2022-11-27T23:45:31+05:30 IST