ఉత్సాహంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-15T06:09:17+05:30 IST

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను భువనగిరిలో సంబురంగా జరుపుకుంటున్నారు.

ఉత్సాహంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు
భువనగిరి పట్టణంలోని బటర్‌ఫ్లై లైట్లను ప్రారంభిసున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

భువనగిరి టౌన్‌, అగస్టు 14: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను భువనగిరిలో సంబురంగా జరుపుకుంటున్నారు. పట్టణంలోని మాసుకుంట నుంచి కలెక్టరేట్‌ వరకు ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై లైట్లను కలెక్టర్‌ పమేలా సత్పథి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆదివారం రాత్రి ప్రారంభించారు. అనంతరం గాంధీ పార్కు వద్ద బాణాసంచా కాల్చి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

చౌటుప్పల్‌ రూరల్‌: స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా దివీస్‌ ల్యాబోరేటరీస్‌ ఆధ్వర్యంలో దివీస్‌ ఉద్యోగులు, కార్మికులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, దివీస్‌ డీజీఎం సుధాకర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో లైజన్‌ ఆఫీజర్‌ బీకేకే చౌదరి, సీనియర్‌ ఆఫీసర్‌ శివ ప్రసాద్‌ ఉన్నారు

రామన్నపేట: టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గోదాసు పృద్వీరాజ్‌, జెల్లా వెంకటేష్‌, అక్రమ్‌, ఎంపీటీసీ రేహన్‌, మోటే రమేష్‌, కైరంకొండ నంద్‌కుమార్‌, రాపోలు ఉపేందర్‌, నరసింహ, సాయి, ఉదయ్‌, శేఖర్‌, నరేష్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్‌, మహ్మద్‌ జమీరుద్దిన్‌, మహ్మద్‌ ఎజాస్‌, మహబూబ్‌అలీ, జాని, జానిబాయ్‌, సలీం, రిజ్వాన్‌, గుండాల రమేష్‌, నామనంది అశోక్‌ పాల్గొన్నారు.

ఆలేరు: భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆలేరులో కళాకారులు దేశభక్తి గీతా లు అలపించారు. బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఎస్‌బీఐ వద్ద నిర్వహించిన కార్య క్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ ఎం మారుతీ ప్రసాద్‌, కౌన్సిలర్‌ బేతి రాములు, టీఆర్‌ఎస్‌ నాయకులు బొట్ల పరమబేశ్వర్‌, వెంకటేష్‌, కృష్ణ, కిట్టు, మునిసిపల్‌ ఉద్యోగులు లింగం, యాదగిరి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

భువనగిరి టౌన్‌ : మహానుభావుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్య్రంలో నేటితరం దేశ పురోగతికి చిత్తశుద్ధి చూపా లని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆజాదీ అమృతో త్సవాల్లో భాగంగా నిర్వహించిన జానపద కళా ప్రదర్శనలను ప్రారంభించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన అంజనేయులు వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, కమిషనర్‌ నాగిరెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి ఖాజామోయినోద్దీన్‌, సంజీవరెడ్డి కౌన్సిలర్లు అజీమోద్దీన్‌, ఉన్నారు. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగ బైక్‌ ర్యాలీని అదనపు కలెక్టర్‌ శ్రీనివా స్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో  జేఏసీ నాయకులు ఎంఏ రహీం, సాజిద్‌, ఎండీ ఇక్బాల్‌ చౌదరి, ఎండి జావిద్‌ ఖాద్రీ పాల్గొన్నారు. భువనగిరి హాకీ అకాడమి ఆఽధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీని జిల్లా హాకీ సమాఖ్య  అధ్యక్షుడు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, అకాడమిక్‌ కార్యదర్శి ఓవైసీ ఖాద్రి ప్రారంభించారు. 


త్రివర్ణ పతాకంతో తీజ్‌ పండుగ వేడుకలు 

భువనగిరి టౌన్‌/ భువనగిరి రూరల్‌: తీజ్‌ వేడుకల సందర్భంగా భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని భువనగిరి శివారులోని రాయిగిరి రైల్వేస్టేషన్‌ కాలనీవాసులు ఆదివారం త్రివర్ణ పతాకాలను ప్రదర్శించారు. అనంతరం తీజ్‌ బుట్టలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ పాల్త్యా హనుమంత్‌ నాయక్‌, యువ జన సంఘాల సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీనివాస్‌, మేకల బాల నర్సింహ, బొజ్జ ఎల్లేశ్‌, గిరిజన ప్రతినిధులు రాములు, కిషన్‌, నర్సింగ్‌, జయరాం, శ్రీనునాయక్‌ పాల్గొన్నారు. భువనగిరిలోని బంజారాహిల్స్‌లో నిర్వహించిన తీజ్‌ వేడుకల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-08-15T06:09:17+05:30 IST