గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : చిరుమర్తి

ABN , First Publish Date - 2022-05-17T06:52:36+05:30 IST

గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుం దని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని చెరుకుపల్లిలో చెరుకుపల్లి-కేతేపల్లి రహదారి మరమ్మతు పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. పల్లెల అభివృధ్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ వి.లక్ష్మమ్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షు

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : చిరుమర్తి
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కేతేపల్లి, మే 16: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుం దని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని చెరుకుపల్లిలో చెరుకుపల్లి-కేతేపల్లి రహదారి మరమ్మతు పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. పల్లెల అభివృధ్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ వి.లక్ష్మమ్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మారం వెంకటరెడ్డి, నాయకులు బంటు మహేందర్‌, కె.ప్రదీప్‌రెడ్డి, చిమట వెంకన్న, జి.సత్యనారాయణ, కొండ సైదులు, అల్లి వెంకన్న, కె.సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని చెరుకుపల్లిలో జరిగిన గంగదేవమ్మ పండగలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ముదిరాజ్‌లు నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయ పనులకు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా నిర్వహిస్తున్న గంగదేవమ్మ జాతరలో పాల్గొని ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు జి.మాధవరెడ్డి, బడుగుల నరేందర్‌, అల్లి మల్లేష్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:52:36+05:30 IST